VKB: కొడంగల్ తహసీల్దార్ రాంబాబు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం సందర్శించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించారు. వంట గది, బాత్రూంలు, పాఠశాల వసతులను తిరిగి చూశారు. అన్ని వసతులు బాగున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామదాస్, పాఠశాల బృందం పాల్గొన్నారు.