మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10కోట్లు వసూలు చేశారనే ఆరోపణలను సింగర్ మంగ్లీ కొట్టిపారేశారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజం నిలకడగా తెలుస్తుందన్నారు. కొందరు వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.