కామారెడ్డి భగీరథుని కృషి స్ఫూర్తిదాయకమని,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చెప్పాడు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో, మహర్షి భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జయరాజ్ పాల్గొన్నారు.