KRNL: ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం పెరిగి అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి రికార్డులను తారుమారు చేస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ విధానాలతో ఆస్తి తగాదాలు పెరుగుతున్నాయని, నకిలీపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.