రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటికీ టీవీలో కార్టూన్స్ చూస్తానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఇలా కార్టూన్లు చూసే అలవాటు ఉందన్నాడు. దీంతో చాలా రిలాక్స్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇలా ఆడాలి.. అలా ఆడాలని బుర్ర బద్దలు కొట్టుకోనని, మ్యాచ్‌లోకి దిగితే తన దృష్టి అంతా గేమ్ పైనే ఉంటుందని వెల్లడించాడు.