GNTR: రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో భగీరథ మహర్షికి ఆమె నివాళులర్పించారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం చంద్రబాబు అపర భగీరథుడని కొనియాడారు. పోలవరం, హంద్రీనీవా, రాయలసీమ ప్రాజెక్టులతో నీరందిస్తున్నామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి ‘జలధార’ ద్వారా పూర్తిస్థాయిలో సాగు, తాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు