PPM: జనగణన 2026లో భాగంగా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ‘గిరిజన ప్రాంతాలు’ థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఆయన స్వయంగా గిరిజన గూడాలను సందర్శించి, స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. గిరిజనుల వివరాల నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. క్షేత్రస్థాయిలో గణన తీరును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.