TG: రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారనుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో గంటకు 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వాతావరణంలో వచ్చే ఈ ఆకస్మిక మార్పుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.