TG: Dy CM భట్టి విక్రమార్కతో ఆర్టీసీ జేఏసీ మూడో దఫా చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. సమ్మె విరమణకు సంఘాలు సానుకూలత తెలపగా, కార్మిక బెనిఫిట్స్ దశలవారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని సమాచారం. విలీన ప్రక్రియపై కమిటీ ఏర్పాటుకు ఇరువర్గాలు మొగ్గు చూపాయట. సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని జేఏసీ కోరగా, పురోగతిని అధికారులు సీఎంకు వివరించారని తెలుస్తోంది.