TG: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉందట. కేబినెట్ బేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిన్న రాత్రి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై చర్చించినట్లు సమాచారం.