తమన్నా భాటియాతో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆయన ‘జవాన్’ ఫేమ్ ఆలియా ఖురేషీతో కలిసి ముంబైలోని బాంద్రాలో కెమెరాలకు చిక్కాడు. వీరిద్దరూ ఒక జపనీస్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి బయటకు వస్తూ సందడి చేశారు. ఆలియాతో విజయ్ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.