ATP: అనంతపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టుదలతో గంగను భువికి తెచ్చిన ఆయన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. లక్ష్య సాధనలో భగీరథుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.