సత్యసాయి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుని పట్టుదల నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాల్గొన్నారు.