AP: అందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులు ఏసీవి పెట్టి పేదలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. డబ్బున్న వారే కాదని.. పేదలు గౌరవంగా ఏసీ బస్సుల్లో తిరగాలనేదే తన కోరిక అని తెలిపారు. 22 నెలల వ్యవధిలో 117 ప్రాజెక్టులు క్లియర్ చేశామని చెప్పారు. దీంతో రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 4.76 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.