AP: అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతోందని.. దేశంలోనే నంబర్ వన్‌గా తయారవుతుందని తెలిపారు. ఇటీవలే రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. రాంబిల్లిలో రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ రూ.5,400 కోట్ల పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు.