TG: మేడిగడ్డ పర్యటనను తాము ముందే నిర్ణయించుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. BRS వాళ్లు సభ పెట్టుకున్నారని.. తాము టూర్ పెట్టుకున్నామని అనడం సరికాదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అని ఉత్తమ్ అన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమే అతిపెద్ద తప్పు నిర్ణయమన్నారు. దీని వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందన్నారు.