HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా టౌన్ ప్లానింగ్ (24), ఇంజనీరింగ్ (7) విభాగాలపై వినతులు వచ్చాయి. కమిషనర్ స్వయంగా ప్రజలతో మాట్లాడి, ప్రతి సమస్యను సమీక్షించి, సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన పౌర సేవలే లక్ష్యంగా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.