AP: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానిక క్యాడర్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించింది. 95% పోస్టులు స్థానికులకు, 5% ఓపెన్ కోటాలో భర్తీ చేస్తారు. వరుసగా 4 ఏళ్ల నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికతను నిర్ణయిస్తారు. వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయి పోస్టులను విభజించారు.