MBNR: మిడ్జిల్ మండలం వేముల గ్రామం తుమ్మడి కుంట శివారులో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైతు రవి నాయక్‌కు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. కష్టపడి సాగు చేసిన పంట కళ్లముందే బూడిదవ్వడంతో రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు రవినాయక్ వేడుకుంటున్నారు.