ADB: ఉట్నూర్ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఆయన పీఎంఆర్సీ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఉదయం గోండ్ గుడా గ్రామాన్ని సందర్శించి, స్థానిక ఆదివాసులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.