TG: రాష్ట్రంలో కొత్తగా మరో 16 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 198 మార్కెట్ యార్డులుండగా రైతుల అవసరాల కోసం కొత్తవి కావాలని పలు ప్రాంతాల నుంచి వినతులు వచ్చాయి. వీటిలో ప్రజాప్రతినిధుల సూచనల మేరకు 16 యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో పదింటికి స్థలాలను గుర్తించారు.