JGL: రాయికల్లో ఆలూరు, వీరాపూర్, ధర్మాజీపేట, ఒడ్డె లింగాపూర్ గ్రామంలోని పలు ఉద్యాన పంటలను, మల్బరీ సాగు, మష్రూమ్ పంట సాగును జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి లత పరిశీలించారు. పుచ్చ, బీర, టమాటా పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. పుట్టగొడుగుల పెంపక కేంద్రాన్ని పరిశీలించారు. 45 రోజుల్లో ఆదాయాన్ని పొందే పట్టుపురుగుల పెంపకం ఉపయోగకరంగా ఉంటుందన్నారు.