జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మె కారణంగా భూపాలపల్లి బస్ డిపోలో 60 బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్మికులు బుధవారం డిపో ముందు నిరసన ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.