MDCL: కాలువలు, నాళాలలో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సులభతరం అవుతుందని, దీనివల్ల వర్షాకాలంలో వరద ముప్పు తగ్గుతుందని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ హరిజన బస్తీలో ఆమె పర్యటించి పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.