NZB: నూతనంగా నియమితులైన తెలంగాణ యూనివర్సిటీ క్లాస్-2 పాలకవర్గ సభ్యులను సోమవారం వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యూనివర్సిటీకి ఆహ్వానించి సన్మానించారు. వర్సిటీ పనితీరు, కొనసాగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. పాలకమండలి సభ్యులు వర్సిటీ అభివృద్ధికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు. పాలకమండలి సభ్యులు ప్రొ. ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.