MNCL: మందమర్రి ఏరియాలోని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. కొత్త టెండర్ పిలిచి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.