MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’లో హెచ్ఎం తారా సింగ్ పాల్గొన్నారు. నర్సరీ నుంచి 5 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లల భవిష్యత్తు మారుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.