AP: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.