KMR: జిల్లాలో నేటి నుంచి 27 వరకు 14 పరీక్షా కేంద్రాల్లో ఓపెన్ పది, ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO రాజు తెలిపారు. ఉ. 9 నుంచి 12 గం. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షలు జరిగే సమయంలో హాల్ టికెట్లతో పాటు ఆధార్ కార్డులు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలన్నారు.