SKLM: ఆయిల్ పామ్ ధరలు పెరిగాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో టన్ను ధర రూ.21,836 ఉండగా ప్రస్తుతం రూ.22,936కు పెరిగిందని తెలిపారు. మొక్కల కొనుగోలులో శత శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కొనసాగుతుందని తెలిపారు.