TG: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపనుంది. ఈ సంస్మరణ దినోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం స్థానిక గిరిజనులతో సమావేశమవుతారు. కాగా, గత ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.