BPT: ముక్తేశ్వరం పంచాయతీ పరిధిలోని దొడ్డికొండలో ఆదివారం ఆకతాయిలు నిప్పు పెట్టడంతో అగ్ని వ్యాపించింది. సుమారు 200 ఎకరాలకు పైగా విస్తరించిన కొండలో వృక్ష సంపద దగ్ధమవుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి వేగంతో మంటలు గ్రామం వైపు వ్యాపించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.