CTR: రోడ్డు ప్రక్కన దొరికిన అమ్మవారి విగ్రహం పుంగనూరులో కలకలం రేపింది. ఆదివారం పట్టణ పరిధిలోని కొత్తపేట రాగానిపల్లి రోడ్డు శాంతి నగర్ సమీపంలో రోడ్డు ప్రక్కన ఉన్న దేవత విగ్రహాన్ని స్థానికులు గుర్తించారు. పంచలోహపుతో తయారు చేసిన విగ్రహం అంటూ పుకార్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. ఆ విగ్రహం ముంత (మట్టి)తో తయారు చేసిందన్నారు.