KNR: ఈరోజు మధ్యాహ్నం వల్బాపూర్ రైతు వేదికలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు AEO, సంగీత తెలిపారు. శాస్త్రవేత్తలు మట్టి నమూనాల సేకరణ, సాయిల్ హెల్త్ కార్డ్ ఉపయోగాలు, వేసవి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యతను వివరిస్తారు. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.