SRPT: తిరుమలగిరిలో బసవేశ్వరుడి జయంతిని బలిజ సంఘం అధ్యక్షుడు సోమరాజు ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించారు. బసమేశ్వరుడి ఫ్లెక్సీకి మార్కెట్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి పూలమాలలు వేసి పూజలు చేసి మాట్లాడారు. మహాత్మా బసవేశ్వరుడు గొప్ప మానవతా వాది అని, అంత కంటే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.