RR: చేవెళ్ల బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరిగాయి. అగ్నిమాపక అధికారి రవీందర్ రెడ్డి విద్యార్థులకు ప్రమాదాల నివారణ, మంటలు ఆర్పే విధానాలపై అవగాహన కల్పించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.