NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు కేతపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ ఛైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డితో పాటు బంటు మహేందర్, సైదిరెడ్డి, వేణు మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.