AP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకుని టీటీడీ, కనకదుర్గమ్మ దేవాలయ వేద పండితులు ఆయనకు ఘనంగా ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈవో, దుర్గగుడి ఈవోలు సీఎంను కలిసి వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు, శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని పండితులు ఆకాంక్షించారు.