KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని ప్రాచీన శివాలయం, పోచమ్మ గుడులు దాతల ఉదారతతో కొత్త శోభను సంతరించుకున్నాయి. శివాలయాన్ని సాగర్ తన స్వంత ఖర్చుతో అభివృద్ధి చేయగా, పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి మల్లారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, సంపత్ ముందుకొచ్చారు. సుమారు రూ.2 లక్షల వ్యయంతో గుడి చుట్టూ షెడ్, మినీ కంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు.