PDPL: జాంబియాలో జరగనున్న అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు జడ్జిగా హైదరాబాద్ సింగరేణి భవన్ ఆర్ఎంవో(మెడికల్ సూపరింటెండెంట్) డా.రాజేశ్వర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం సింగరేణి సంస్థ ఉద్యోగులు,ఆత్మీయులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు. అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు జడ్జిగా వెళ్లడం సింగరేణి సంస్థకు గర్వకారణమన్నారు.