కాంతార స్టార్ రిషబ్ శెట్టి ‘యూత్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని, ఇది తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమతి అని కొనియాడాడు. నటీనటులు సహజంగా నటించారని, దర్శకుడు కెన్ కరుణాస్ పరిశ్రమకు దొరికిన ఆస్తి అని పేర్కొన్నాడు. టీనేజ్ ప్రేమ, బ్రేకప్, జీవిత పాఠాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది.