SDPT: మామిడి పంటకు నిలయమైన నంగునూరు మండలం ముండ్రాయిలో విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లాలోని రైతులు తమ దిగుబడిని నేరుగా ఇక్కడి మండీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బిహార్, యూపీకి చెందిన వందలాది వలస కూలీలకు ఇక్కడ ఉపాధి లభిస్తోంది. బంగినపల్లి, రసాలు, కేసర్ రకాలను ట్రేలలో ప్యాక్ చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.