SRD: చౌటకూర్ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మంజీర నది నుంచి ఇసుక అక్రమంగా రవాణ జోరుగా సాగుతుంది. నదిలో నుంచి ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, నది ప్రవాహక ప్రాంతం నుంచి గాడిదలపై ఇసుకను తరలించి ఒడ్డుకు చేర్చి అక్రమంగా అమ్మకాలు నిర్వహిస్తూన్నారని ప్రజలు వాపోతున్నారు.