KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓదెల మండలం కనగర్తికి చెందిన శంకరయ్య (60) గంగిపల్లి నుంచి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో దాన్నితప్పించబోయి రోడ్డుపై అదుపుతప్పి కిందపడిపోయారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తలకు, భుజానికి గాయాలయ్యాయన్నారు.108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.