VKB: జిల్లా కేంద్రంలోని ఎమ్మార్పీ చౌరస్తా వద్ద వీరశైవ సమాజం ఆధ్వర్యంలో సోమవారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గంగిడ వీరేశం అధ్యక్షతన బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి బసవరాధన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సదానంద రెడ్డి, నూలి బసవరాజ్, శివానందం తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వరుని బోధనలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.