KRNL: చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామ ఎత్తిపోతల పథకంపై రైతులు ఇవాళ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిను కలిసి వినతిపత్రం సమర్పించారు. 230 ఎకరాలకు నీరందించే ఈ పథకంలోని మోటర్లు పాడవడంతో సాగు నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. జిల్లా ఏఈ పరిశీలించి కొత్త మోటర్ల అంచనాలు తీసుకున్నప్పటికీ పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.