HNK: పరకాల మండలంలోని నాగారం గ్రామంలో శ్రీ శ్రీ సిద్దేశ్వర సహిత ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ రావు, విజయ్ చందర్ రెడ్డి, ఇతరులు ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.