MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కౌడిపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన 2027 శిక్షణ తరగతులను నర్సాపూర్ ఆర్డీవోతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ గణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు.