సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో ఆయుష్ విభాగాల ఉద్యోగుల కోసం ఆక్యుప్రెషర్ రిఫ్లెక్సాలజీపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒడిశాకు చెందిన స్వామిత్వ దాస్ బృందం విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించే మార్గాలను వివరించారు. శరీరంలోని వివిధ పాయింట్ల ద్వారా సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధానాలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు.