NGKL: జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఈ పథకం గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీలలో పని అనుభవం, వివిధ రంగాలపై పరిజ్ఞానం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. దీని ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.